స్వర్ణకారులకు మంత్రి నక్కా పరామర్శ
గుంటూరు,సెప్టెంబర్6(జనంసాక్షి): మంగళగిరి టౌన్‌లో గురువారం స్వర్ణకారులు సంయుక్తంగా రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 9 రోజుల నుంచి13 జిల్లాల స్వర్ణకారులు సంయుక్తంగా చేస్తున్న ఈ దీక్షల్లో
స్వర్ణకారులు తమకు కార్పొరేషన్‌తో పాటు దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రి నక్కా ఆనందబాబు స్వర్ణకారులు రిలే నిరాహార దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించారు. స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు గుంజేపల్లి బాల శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో స్వర్ణకారులంతా మంత్రి ఆనందబాబుకి తమ వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి నక్కా ఆనందబాబు హావిూ ఇచ్చారు.