స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ తో పాటూ, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, కొన్ని కార్పొరేట్ కంపెనీల ఫలితాలు మార్కెట్లను ప్రభావతం చేస్తున్నాయి. దాంతో బీఎస్సీ సెన్సెక్స్ 70 పాయింట్లకు పైగా నష్టంతో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 33 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. అటు బంగారం ధర కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. భారత్‌ తో పాటూ హాంకాంగ్, షాంఘై, జపాన్ మార్కెట్లు కూడా నష్టాల్లో పయనిస్తున్నాయి.