స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో జాతి నాయకులను మరచిన ప్రభుత్వ యంత్రంగం, మంత్రులు-శాసన సభ్యులు.

కరీంనగర్‌:(టౌన్‌) తెలంగాణ మాల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబెడ్కర్‌ విగ్రహనికి పూల మాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా స్వాతంత్య్రన్ని అందించిన జాతీ నాయకులను ప్రభుత్వం మరిచి పోయిందని ప్రభుత్వ యంత్రాగంతో పాటు మంత్రి వర్యులు శాసన సభ్యులు రాజకీయా నేతలు అధికారులు సైతం విస్మరించారని వారికి తగిన గౌరవం కూడా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత స్వాతంత్య్ర మహా సంగ్రామంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులను జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల విగ్రహాలను పూజించటం వారికి గౌరవంగా వందనం చేయటం మన దేశ సంస్కృతి. కాని నేడు 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంధర్భంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీ నాయకుల విగ్రహాలకు పూలమాలలు  గౌరవ వందనం సమర్పించి జాతీయ భావనతో గౌరవించుకొవటం మన ఆచారం. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ నాయకుల వర్ధంతి, జయంతి సంధర్భల్లో మాత్రమే విగ్రహాలకు పూల మాలలు వేసి అలంకరించటం సభలు సమావేశాలు జరపటం ఆనవాయితిగా జరుగుతుంది. కాని స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా మాత్రం జాతీయ నాయకులను మరచిపోవటం అత్యంత శోచనియం. అత్యంత బాధకరమని ఇంతకన్న దౌర్భగ్యం మరెక్కడైన ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిపై జీవోను కూడా ప్రవేశపెట్టాలని, భావి తరాలకు భారత స్వతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకుల గూర్చి తెలియజెప్పి వారి స్పూర్థితో ముందుకెళ్లల్సి ఆవశ్యకత ఎంతైన ఉందని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు