స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొనుటకు కవితల ఆహ్వానం

జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా
తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో  ఆగష్టు16, 2022న సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్,జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి లు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఈ కవి సమ్మేళనంలో పాల్గొనుటకు కవుల నుండి దేశభక్తి పూరితమైన కవితలను ఆహ్వానిస్తున్నామని,కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు తమ కవితలు/పద్యాలు  20 పంక్తులు మించకుండా ఉండాలన్నారు.
కవితాంశము: 75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశభక్తి పూరితమైన కవితాంశం స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి,సమరయోధుల త్యాగాలు చాటేలా ఉండాలని,తమ కవితలను 12 -8 -2022 సాయంత్రం 5.00 గంటల లోగా 8919848969 మొబైల్ నంబర్ కు వాట్సప్ ద్వారా పంపించాలని తర్వాత పంపిన కవితలు పరిగణించ బడవు అన్నారు. కవులు తమ కవితలను పంపించేటప్పుడు వాట్సప్ లో టైప్ చేసి పంపాలి లేదా రాత స్పష్టంగా అర్ధం అయ్యేలా ఉండాలి.కవితల ఎంపికలో సీనియర్ కవులతో ఆధ్వర్యంలో వేసిన
5గురు సభ్యుల కమిటీదే తుది నిర్ణయమని అన్నారు.
ఈ విషయంలో ఏలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావుండదు.
ఎంపిక కాబడిన కవులకు వాట్సాప్ ద్వారా గాని ఫోన్ ద్వారా గాని సమాచారం తెలియజేయబడుతుంది
సమాచారం అందిన వారు మాత్రమే తమ కవితలను చదివే అవకాశం ఉంటుందని
వారు పేర్కొన్నారు.

 

తాజావార్తలు