స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తిని కొనసాగిద్దాం——

 

— జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్..

గద్వాల రూరల్ ఆగస్టు 15 (జనంసాక్షి):- భారత జాతికి స్వేచ్ఛను కల్పించిన స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకొని వారి ఆశయాలను కొనసాగించాలని జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ గారు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ బి రాములు నాయక్ తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు..ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు, పోలీస్ సిబ్బందికి 76 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశ మంతటా ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత వారం రోజులుగా స్వాతంత్ర్య సమర యోధులను స్మరిస్తూ 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరువుకుంటున్నమని, మహనీయులు ఎన్నో పోరాటాలు, తిరుగుబాట్లు చేసి స్వతంత్ర భారత్ ను సాధించారని, సాధించిన స్వతంత్ర భారత్ ను ముందుకు తీసుకెళ్లేందుకు అప్పటి మహనీయులు ఒక వ్యూహరచన చేసి పరిపాలన సాగించడo జరిగిందని అన్నారు.స్వతంత్రo వచ్చిన నాటినుండి స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మహనీయులు పీవీ నరసింహ రావ్ ఆయాలో ప్రపంచీకరణ లో భాగంగా ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని ప్రస్తుతం భారత దేశం ప్రపంచంలోనే బలమైన ఒక శక్తిగా ఎదిగిందని అన్నారు.మనము కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. అదేవిదంగా గద్వాల్ జిల్లా కావడం ఇక్కడి ప్రజల అదృష్టం అని, టెక్నాలజీ ను ఉపయోగించుకొని పోలీస్ శాఖ ముందుకు వెళ్లడం జరుగుతుందని , జిల్లా పోలీస్ వెబ్సైట్ ను తయారు చేయడం వల్ల ప్రజలందరికీ పోలీస్ సమాచారం, సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. భవిష్యత్ లో సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని , బాధితులు ఒకసారి మోసపోతే రికవరీ కావడం కష్టం అని ,వీటి పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం పోలీస్ సిబ్బంది పై ఉందని అన్నారు. సిబ్బంది అందరూ బాగా పని చేస్తున్నారని ఇదే పనితీరును ఇలాగే కొనసాగించాలని అన్నారు.ఈ స్వాతంత్ర వేడుక లలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవo జూన్ 02,2022 నాడు పోలీస్ శాఖలో విధుల యందు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పథకాకాలకు సత్యనారాయణ ఏ. ఎస్సై , వేంకటేశ్వర్ రెడ్డి ఏ. ఎస్సై, కన్నయ్య ఏ. ఎస్సై, నారాయణ హెడ్ కానిస్టేబుల్, వెంకటేష్ హెడ్ కానిస్టేబుల్, తిరుమలేశ్ కానిస్టేబుల్, జి. లక్మన్న కానిస్టేబుల్ లకు జిల్లా ఎస్పీ గారు అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గద్వాల్ డి.ఎస్.పి ఎన్. సి హెచ్ రంగ స్వామి,సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనియోల్,గద్వాల్ సి. ఐ చంద్రశేఖర్,డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శివకుమార్ అడ్మిన్ ఆర్.ఐ నాగేష్,ఆర్.ఐ పెద్దయ్య ,టాస్క్ ఫోర్స్ ఎస్సై శేఖర్ రెడ్డి,జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ,ఐటీ సెల్ సిబ్బంది, డిసిఆర్బి సిబ్బంది, ఎస్ బి సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు…