స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పంద్రాగస్టు వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తరుచుగా వర్షాలు పడుచున్నందున వాటర్ ప్రూఫ్ శామియనాలు ఏర్పాటు చేయాలని, జిల్లా అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో కలసి పూర్తి చేసుకోవాలని సూచించారు.ప్రోటోకాల్ తప్పక పాటించాలని, అలాగే గ్రౌండ్ ను చదునుచేసి అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే వేడుకలను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్, త్రాగునీరు తప్పక ఉండాలని సూచించారు. స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని అన్నారు.ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులకు ప్రత్యేక కంగా కేటాయించిన చోట కూర్చోబెట్టాలని అధికారులను ఆదేశించారు.అంతకు ముందు స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా 16 నుండి 18 వరకు చేపట్టే ఫ్రీడమ్ కప్ నిర్వహణకై స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ ను కూడా పరిశీలించి వివిధ క్రీడల ఏర్పాటుకై సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేంద్రప్రసాద్, పిడి కిరణ్ కుమార్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి , మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
