స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్
గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను అన్నారు.గరిడేపల్లి మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ
ఆనాడు జలియన్ వాలాబాగ్ లో జరిగిన దురంతాన్ని విని చెలించిపోయి భారతీయుల రక్తంతో తడిసి ముద్దయిన జలియన్ వాలాబాగ్ లో ఉన్న మట్టిని తెచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఈ దేశ స్వాతంత్రం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని ఆ మట్టిపై ప్రమాణం చేసిన విప్లవ సింహం భగత్ సింగ్ అని ఆయన అన్నారు.
ఆ అమరవీరుల త్యాగoతో సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి పైన ఉన్నదని ప్రతి యువకుడు సామాజిక బాధ్యతను గుర్తెరగాలని దేశం కోసం సమాజం కోసం తన వంతు సహాయం ఎప్పుడూ అందిస్తూనే ఉండాలని దేశ సమైక్యతకు సమగ్రతకు యువత అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.సర్దార్ భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమంలో షేక్ యాకూబ్, పంగ సైదులు, రేఖ ఉపేందర్, పెండెం శేఖర్, యడవల్లి శ్రీరామ్ చిక్కుళ్ళ వెంకన్న, యడవల్లి వినయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area