స్వాధీన పరుచుకున్న వాహనాల వేలం
ఎక్సైజ్ సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్
సిరిసిల్ల, నవంబర్11(జనంసాక్షి)
అక్రమ సారా మద్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను సోమవారం రోజున వేలం వేయనున్నట్లు సిరిసిల్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఎంపిఆర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రోజున ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ వివిధ నేరాలలో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను సోమవారం మద్యాహ్నం 2గంటలకు సిరిసిల్ల పట్టనంలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయం నందు ఉన్నటువంటి 8ద్విచక్ర వాహనాలను వేలం వేస్తున్నట్లు తెలిపారు. ముందుగా వేలంలో పాల్గనాల్సిన అభ్యర్థులు వివిధ వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలో సగం ధరను దరావత్తుగా చెల్లించవల్సి ఉంటుందని పేర్కొన్నారు.



