స్వీయ చైతన్యం…

భూతాపం ఉగ్ర భూతమై
మానవాళిని గడగడలాడిస్తోంది

అభివృద్ధి పేర
మనిషి ఆడుతున్న వికృత క్రీడా
ప్రకృతి వనరుల “విధ్వంసం” చేస్తుంది
జీవ జాతులకు  “సమాధి” కడుతోముది

అడవుల అన్యాక్రాంతం
జలవనరుల విషతుల్యం
వాతావరణ కాలుష్యం
రసాయనాల మాలిన్యం
వెరసి
పర్యావరణం అసమతుల్యం
మనిషి “అస్తిత్వం” ఆగమ్యగోచరం

గ్లోబల్ వామింగ్ ఫలితం
విపత్తులు …
విస్ఫోటనాలు…
పెను తుఫానులు…
భూకంపాలు పడగ విప్పి
విషం చిమ్ముతున్నాయ్
మృత్యు నృత్యం చేస్తున్నాయి

నిర్లక్ష్యం వహిస్తే…
పుడమి “కన్నీటి” ఎడారి
సత్వరం స్పందిస్తే…
బతుకు “ఆనందా”ల గోదారి

ఇప్పటికైనా…
ప్రతి ఒక్కరు స్వీయ “చైతన్య” శీలురు కావాలి
పర్యావరణ పరిరక్షించ “దీక్ష” బూని సాగాలి
భూతాపాన్ని పొలిమేర దాట తరిమికొట్టాలి
“””””””””””””””
( గ్లోబల్ వార్మింగ్ పై స్పందిస్తూ…)

కోడిగూటి తిరుపతి
జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత
Mbl no 9583929493