హనుమాన్ దీక్ష మాలధారణ గోడపత్ర ఆవిష్కరణ

   కొండమల్లేపల్లి అక్టోబర్ 17 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలోని శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర దేవాలయంలో సోమవారం నాడు శ్రీ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి హనుమాన్ దీక్ష మాల ధారణ గోడపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ కేతావత్ జయరాం  గురుస్వామి వారి కరకమలముల మీదుగా మాలాధారణ జరుగునని తెలిపారు తేదీ 27-10-2022 నుండి 30 -10- 2022 వరకు మూడు రోజులపాటు  హనుమాన్ మాలాధారణ కార్యక్రమం జరుపబడును అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో 30 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలు, కర్ణాటకలో నాలుగు జిల్లాలు కలిపి హనుమాన్ శక్తి  జాగరణ ఏర్పడుతుందని వారు తెలిపారు హనుమాన్ శక్తి జాగరణ మాధ్యమంగా సనాతన ధర్మ పరిరక్షణ, దేశ రక్షణ, ధర్మరక్షణ చేస్తూ.. హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం దేవాలయ కేంద్రంగా పారాయణం చేస్తూ హిందూ  బంధువుల జాగృతం చేస్తూ హనుమాన్ గుణగణాన్ని గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో హనుమాన్ దీక్ష ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర దేవాలయ ప్రధాన కార్యదర్శి బొడిగె బాలరాజు గౌడ్, హనుమాన్ శక్తి జాగరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయప్రోలు మురళీకృష్ణ గురు స్వామి, కేతావత్ అజయ్ గురుస్వామి వివాహరాల కమిటీ ప్రముక్, ధర్మ జాగరణ పరియోజన ప్రముక్ నర్యా  గురుస్వామి , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్  రాంబాబు నాయక్, పరమేష్ గురుస్వామి, రమావత్ గిరి నాయక గురు స్వామి, నాగరాజు, కృష్ణారెడ్డి, బొడ్డుపల్లి సైదులు, హనుమంతు లక్ష్మణ్ రాజు  తదితరులు పాల్గొన్నారు
Attachments area