” హఫీజ్ పేట్ మాదాపూర్ డివిజన్ పరిధిలో ఆసరా పింఛన్ల పంపిణీ కోలాహలం”
మాదాపూర్, సెప్టెంబర్ 22( జనంసాక్షి): వృద్ధులు, వికలాంగులు, వితంతువులకొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లలోభాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో గురువారం పెద్ద మొత్తంలో ఆసరా పింఛన్ల పంపిణీ చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ వి పూజిత జగదీశ్వర్ గౌడ్ నేతృత్వంలో కొనసాగిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తో కలిసి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ద, వికలాంగుల, వితంతువులకు విజయవంతంగా అందిస్తున్న ఆసరా పెన్షన్లు 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు తగ్గించడం జరిగిందని, తద్వారా ఎంతోమందికి పింఛన్లను అందుకునే అవకాశం కల్పించినట్టయ్యిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పింఛన్లను సీఎం కేసిఆర్ మంజూరు చేసినందున శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో నూతనంగా వెయ్యిమందికి కొత్తగా ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులకు డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆసరా పెన్షన్ల ఉత్తర్వులను అందజేశారు. ఆసరా పింఛన్ల అర్హత వయోపరిమితి 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపట్ల పెద్దఎత్తున హర్షం వ్యక్తంచేశారు. సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికీ విస్తరించాలన్న చిత్తశుద్దితో కేసీఅర్ పకడ్బందీగా ముందుకు సాగుతున్నాడన్నారు.
తల్లిదండ్రులు పెద్దదిక్కుగాఉండి కుటుంబాన్ని ఎలా నడిపిస్తారో అదేతరహాలో రాష్ట్ర ప్రజలకు, పేదలకు ముఖ్యమంత్రి కేసీఅర్ పెద్ద దిక్కుగావుండి ఆసరా పెన్షన్ లు వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, డివిజన్ సీనియర్ నాయకులు, మహిళలు, వార్డ్/ఏరియా సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..