హమాలీలు సీరియల్ ప్రకారం వడ్లు తూకం వేయడం లేదని రైతుల ధర్నా
రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి);
సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతుల ధాన్యాన్ని సీరియల్
ప్రకారం హమాళిలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో రైతులు శనివారం అంబేద్కర్ చౌక్ లో బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…హమాళిలు సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన విదంగా కొనుగోళ్లు చేస్తున్నారని 20 రోజుల క్రితం తీసుక వచ్చిన ధాన్యం తేమశాతం వచ్చిన కొనకుండా 3 రోజుల ముందు తెచ్చిన వ్యక్తుల వడ్లను తేమశాతం వచ్చిందంటూ కొంటున్నారని కొనుగోలు నిర్వాహకులు చెప్పిన హమాలీలు వినడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.వర్షాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో త్వరగా సీరియల్ ప్రకారం వడ్లను కొనాలని రైతులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి జడ్పిటిసి గట్ల మినయ్యతో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా విరమింప జేశారు.