హరిత హరం తెలంగాణకు మణిహారం;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ సెప్టెంబర్ 20 ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘం పరిధిలోని 2వా వార్డ్ తమ్మర  యందు మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  ఆధ్వర్యంలో ఇంటింటికి పూల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రాన్ని హరిత తెలంగాణ  చెయ్యాలన్న ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాల్లో బాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నమని వాటి అందరూ తమ ఇండ్ల ముందు,ఇంటి ఖాళీ స్థలాలో తమ వంతుగా మొక్కలు నాటాలి అని,సృష్టిలోని ప్రతి ప్రాణి బతకాలంటే చెట్లే ఆధారం అని,చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్‌ మాత్రమే అన్ని ప్రాణులను రక్షిస్తుందని,ఇంట్లో పంపిణీ చేసిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటే అవి రేపు మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయని వాటితోపాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు వార్డ్ ఆఫీసర్ నారాయణ,కాసాని శివ, గురునాధం, చందు, మరియు  వార్డు మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.