హర్మీత్‌సింగ్‌పై బీసిసిఐ సస్పెన్షన్‌ వేటు


ముంబై ,జూలై 6 (జనంసాక్షి):

రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ హర్మీత్‌సింగ్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సస్పెండ్‌ చేసింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి అతనిపై విచారణ జరపాలని నిర్ణయించింది. గురువారం హర్మీత్‌సింగ్‌ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కీలక వివరాలు ఉన్నా యి. దీని ప్రకారం అజిత్‌ చండిలా ఒక బుకీతో కలిసి రాజస్థాన్‌ ఓపెనర్‌ షేన్‌వాట్స న్‌ను కలవాల నుకున్న విషయాన్ని హర్మీత్‌ వెల్లడిం చాడు. అలాగే తనను కూడా ఫిక్సింగ్‌ చేయవ ుని అడిగినట్టు చెప్పాడు. ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ వివాదంపై విచారణ జరుపుతోన్న ఢిల్లీ పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ను మేజిస్టేట్ర్‌ సమక్షంలో రికార్డు చేశారు. అయితే బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని చెప్పనందుకు బీసిసిఐ అతనిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఫిక్సింగ్‌ వివాదంలో అతని పాత్ర గురించి విచారించేందకు కూడా సిధ్ధమైంది. దీనిలో భాగంగా బీసిసిఐ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ చీఫ్‌ రవి సావాని హర్మీత్‌ను విచారించనున్నారు. గత ఏడాది భారత్‌ అండప్‌ 19 ప్రపంచకప్‌ గెలుచినప్పుడు ఆ జట్టు హర్మీత్‌సింగ్‌ కూడా ఉన్నాడు. ఆరో సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ఈ యువస్పిన్నర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.