హస్నాబాద్ లో ఘనంగా శ్రీవాల్మీకి మహర్షి జయంతి

రాయికోడ్ జనం సాక్షి 09 రాయికోడ్ మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పవిత్ర గ్రంథం రామాయణాన్ని రచించిన శ్రీవాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు గ్రామంలో వాల్మీకి ఛాయాచిత్ర పటానికి  పూలమాల వేసి వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ జయంతి కార్యక్రమంలో సర్పంచ్ హన్మంతు . ఉప సర్పంచ్ జైపాల్ వార్డు సభ్యులు మహేష్…. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు,ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు,యువజన సంఘాల నాయకులు   నిర్వహించారు.