హాకీ లీగ్‌లో ..ఇండియన్‌ ఆటగాళ్లకు టాప్‌బేస్‌ ప్రైస్‌

15 లక్షల కేటగిరీలో భారత ఆటగాళ్లు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15:  ఐపీఎల్‌లో తరహాలో హాకీలో ప్రారంభించనున్న హెచ్‌ఐఎల్‌ ఆటగాళ్ళ వేలానికి సంబంధించిన జాబితాను హాకీ ఇండియా విడుదల చేసింది. మొత్తం 246 మంది ప్లేయర్స్‌ దీనిలో భాగంగా కానున్నారు. భారత జట్టులోని సీనియర్‌ స్టార్‌ ప్లేయర్స్‌ సర్థార్‌ సింద్‌, సందీప్‌సింగ్‌లకు టాప్‌ బేస్‌ ప్రైస్‌దక్కింది. వీరిద్దరి కనీస ధరను 15 లక్షలుగా నిర్ణయించారు. రేపు జరగనున్న వేలంలో వీరిదే అత్యధిక ధర. వీరి తర్వాత విదేశీ ఆటగాళ్ళు జావిూ డయర్‌, మోర్తిజ్‌ ఫుర్ట్స్‌, టాన్‌ ది నూజర్‌ 13.5 లక్షల బేస్‌ ప్రైస్‌తో అందుబాటులో ఉండనున్నారు. ఈ వేలం పాటలో ఆటగాళ్ళందరినీ 13 కేటగిరీలుగా విభజించారు. వీరి ధరను 1.5 లక్షల నుండి 15 లక్షల వరకూ నిర్ణయించారు. సందీప్‌, సర్థార్‌ల తర్వాత గుర్బజ్‌సింగ్‌, శివేంద్రసింగ్‌లకు 10 లక్షల కేటగిరీలో చోటు దక్కింది. మిగిలిన భారత ఆటగాళ్ళలో ఇగ్నేష్‌ టిర్కీ, వి రఘునాథ్‌, గుర్విందర్‌ చాంది, ఎస్‌వి సునీల్‌, సర్వంజిత్‌సింగ్‌, డానిష్‌ ముజ్తాలు 7.5 లక్షల కేటగిరీలో ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెర తీసిన ఐపీఎల్‌ తరహాలోనే హాకీలో కూడా లీగ్‌ను ప్రారంభించాలని ఇటీవలే నిర్ణయించారు. గత ఏడాది ఇండియన్‌ హాకీ ఫెడరేషన్‌ మొదలుపెట్టిన వరల్డ్‌ హాకీ సిరీస్‌కు ధీటుగా హాకీ ఇండియా ఈ లీగ్‌ ప్రారంభిస్తోంది. హాకీ ఇండియా లీగ్‌గా పిలిచే ఈ టోర్నీలో ఫ్రాంచైజీల కోసం పలు కార్పొరేట్‌ కంపెనీలు ఎగబడ్డాయి. ఇప్పటికే నాలుగు ఫ్రాంచైజీలు ఖరారు కాగా మిగిలిన రెండింటిపైనే త్వరలోనే నిర్ణయం రానుంది. హెచ్‌ఐఎల్‌తో హాకీకి మరింత ఆదరణ పెరుగుతుందవి నిర్వాహకులు చెబుతున్నారు.

హాకీ ఇండియా లీగ్‌ ఫార్మేట్‌ ః

మొత్తం ఆరు జట్లు

ప్రతీ టీమ్‌లో 24 మంది ప్లేయర్లు – మొత్తం 144 మంది ప్లేయర్లు

ప్రతీ జట్టులో 10 మంది విదేశీ ఆటగాళ్లు

144 మందిలో 90 మంది భారత ఆటగాళ్ళు

జనవరి, ఫిబ్రవరిలో టోర్నీ

మొత్తం 33 మ్యాచ్‌లు

ఫ్రాంచైజీ వివరాలు ః

సహారా ఇండియా – లక్నో

జెపీ గ్రూప్‌        –  పంజాబ్‌

పటేల్‌ యు నిక్సెల్‌ గ్రూప్‌ – రాంఛీ

వేవ్‌ గ్రూప్‌         – ఢిల్లీ

చెన్నై , ముంబై ఫ్రాంచైజీలకు ఖరారు కాని ఓనర్లు

టీవీ పార్టనర్‌ ః ఈఎస్‌పిఎన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ఐదేళ్ళ పాటు కాంట్రాక్ట్‌

ఆటగాళ్ళ బేస్‌ప్రైస్‌ జాబితా ః

15 లక్షలు – సర్దార్‌సింగ్‌, సందీప్‌సింగ్‌

10 లక్షలు – గుర్బజ్‌సింగ్‌, శివేంద్రసింగ్‌

7.5 లక్షలు – ఇగ్నేష్‌ టిరీ, వి రఘునాథ్‌, గుర్విందర్‌ చాంది, ఎస్‌వి సునీల్‌, సర్వంజిత్‌సింగ్‌, డానిష్‌ ముజ్తా, తుషార్‌ ఖండ్కర్‌

5 లక్షలు – రూపేందర్‌పాల్‌సింగ్‌, భీరేంద్ర లక్రా , కొత్తజిత్‌ సింగ్‌ మన్‌ప్రీత్‌సింగ్‌, ఎస్‌కె ఊతప్ప , యువరాజ్‌ వాల్మీకి, నితిన్‌ తిమ్మయ్య.