హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం
వరంగల్: విద్యుత్ కోతలకు నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ కార్యాలయంలో నికిచొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాం చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.