హామీలు అమలయ్యే వరకు పోరాడుతాం
– జేఏసీ అధ్యక్షులు బాలకృష్ణ
డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి
శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు గత డెబ్బై ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.సోమవారం రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు డోర్నకల్ వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు దిగ్బంధం చేశారు.తహశీల్దార్ ఆఫీస్ గేటుకు తాళం వేసి వీఆర్ఏలు నిరసన తెలిపారు.సమస్యలను పరిష్కరించాలనీ 78 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అవసరమైతే మునుగోడు ఉప ఎన్నికల్లో వీఆర్ఏలు నామినేషన్ వేయడానికి సైతం వెనకాడమని అన్నారు.డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపట్టారు.అనంతరం పోలీసులు వీఆర్ఏలను అదుపులోకి తీసుకొని పూచికతపై విడుదల చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏలు సాయి,సురేష్,భారతి తదితరులు పాల్గొన్నారు.