హావిూలను విస్మరించి కూటమిపై విమర్శలా?

టిఆర్‌ఎస్‌ నేతల తీరుపై మండిపడ్డ జీవన్‌ రెడ్డి

జగిత్యాల,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టీ.జీవన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబును విమర్శించే ముందు తెలంగాణలో విూరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండు చేశారు. ఇచ్చిన హావిూలును విస్మరించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ

తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని అన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, తెజస అధ్యక్షుడు కోదండరాం, గద్దర్‌లతో పాటు వామపక్షాలు, విమలక్క లాంటి వారు అంతా ఒక్కటవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. వీరంతా కలిసి కేసీఆర్‌ను గద్దె దించటం ఖాయమని జోస్యం చెప్పారు. జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెరాస నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. కూటమిని విమర్వించే ముందు విూ హావిూలపై ప్రజలకు వివరాలు ఇవ్వాలన్నారు. ఇచ్‌ఇచన హావిూలను తుంగలో తొక్కి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.