హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

ఏఐఎస్ఎఫ్ నాయకుల హాస్టల్ సందర్శిన
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17 : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతిగృహాలకు మెస్ చార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. సోమవారం సంక్షేమ వసతి గృహాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు కలిసి సందర్శించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెస్ చార్జీలు గత 2017 నుండి నేటి వరకు అవే బిల్లులతో కాలాన్ని గడుపుతున్న ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పు, వంట నూనె, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికి మెస్ చార్జీలు పెంచకపోవడం కారణంగా విద్యార్థులకు చాలి చాలని భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై ఉన్న శ్రద్ధ విద్యాశాఖ, విద్యార్థులపై లేదని, ఇప్పటికైనా పెరిగిన నిత్యావసర సరుకులధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు భోగి మనోహర్, ఆత్మకూరి హరికృష్ణ, ఎర్రోళ్ల అఖిల్, ఎర్రోళ్ల ఛత్రపతి ఉన్నారు.