హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు

జహీరాబాద్ ఆగస్టు 19( జనంసాక్షి)
హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ను ముట్టడించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కిందట పెంచినటువంటి హాస్టల్ మెస్ మరియు కాస్మెటిక్ చార్జీలను ఇప్పటివరకు మార్చకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎందుకంటే ఈరోజు హాస్టల్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందక అనారోగ్యాల పాలవుతున్నారని అలాగే కాస్మెటిక్ ఛార్జీలు సరిపోక నెలకు సరిపడా వస్తువులు కొనలేక విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై పరీక్షించి పరిష్కారం చేయాలని లేనియెడల రాష్ట్రమంతటా ఉద్యమాలను ఉద్రిక్తతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఏరియా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, నాయకులు అరవింద్,హరీష్,అతిక్ పాషా,భాను ప్రసాద్,మోజస్,తదితరులు పాల్గొన్నారు.