హిందుత్వ హీరో బాల్‌ థాకరేకు ముస్లిం వైద్యుడి చికిత్స

ముంబయి : తనువంతా అదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్‌ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. శనివారం అయన మృతిని ప్రకటించింది. కూడా అ వైద్యుడే వైద్య సేవలు చేస్తున్నారు. చివరి నిమిత్తం వరకు థాకరేకు అయన వైద్య సేవలు అందించారు.

థాకరేకు జలీల్‌ అంటే ప్రత్యేకమైన విశ్వాసం. ఇతడు లీలావతి అసుపత్రిలో ఉపిరితిత్తులకు సంబందించిన వైద్య నిపుణుడు. థాకరేకు నమ్మకమైన వైద్యుడిగా అయన ఇన్నేళ్లుగా కోనసాగారు. థాకరే మృతిని జలీల్‌ కన్నీటి పర్వంతమై ప్రకటించారు. కోన్నేళ్ల క్రితం  శ్వాస సంబంధమైన వ్యాధితో  తీవ్ర అస్వస్థతకు గురైన థాకరేకు జలీల్‌ విజయవంతంగా చికిత్స  చేశారు.

థాకరేతో పాటు అయన కుటుంబ సభ్యల విశ్వాసాన్ని కూడా జలీల్‌ పోందారు. ఈ ఐదేళ్లలో జలీల్‌ పార్కర్‌ శివసేన అధినేత ప్రాణాలను ఐదుళ్లలో జలీల్‌ పార్కర్‌ శివసేన అధినేత ప్రాణాలను ఐదుసార్లు కాపాడారట. థాకరేకు ఏ అరోగ్య సమస్య వచ్చినా అయనే వైద్యం చేసేవారు.థాకరే తనయుడు ఉద్దవ్‌థాకరేకు గుండే శస్త్ర చికిత్స కూడా జలీల్‌ సారధ్యంలోని వైద్య బృందమే నిర్వహించింది.

హిందుత్వ వాది అయిన థాకరే వ్యక్తిగత వైద్యుడు ఓ ముస్లిం వ్యక్తి ఉండటంపై రాజకీయ విమర్శలు రాజకీయ విమర్శలు వెల్లువెత్తినా… జలీల్‌ ఏమాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాక థాకరే తనను ఎంతగానో అదరిస్తారని సమదానం చేప్పేవారు. జలీల్‌…థాకరే కుటుంబానికి ఎంత సన్నిహితుడు అంటే ఈ సంవత్సరం పార్టీ తరపున జరిగిన దసరా వేడుకల్లో అయనకు డయూస్‌ పైనా సీటు కేటాయించారు.