హింద్ హ్యూమన్ రైట్స్ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడికి ఘన సన్మానం
జనం సాక్షి లింగాల ప్రతినిధి
హింద్ హ్యూమన్ రైట్స్ అసెంబ్లీ యూత్ అధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించిన ఎండి సమీర్ ను ఆదివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో లింగాలలో ఘనంగా సన్మానించారు. మండల కేంద్రానికి చెందిన ఎండి సమీర్ యూత్ అధ్యక్షుదిగా ఎన్నికైన సందర్భంగా పలువురు నాయకులు, యువకులు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కూడలి వద్ద సమీర్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లింగాల సామాజిక కార్యకర్త బాలాజీ, పూజారి వెంకటయ్య, తరుణ్, భాస్కర్, రాజేష్, ఇరుకు శ్రీను, బళ్లారి తిరుపతయ్య, యువకులు అత్తా ఉల్లా, సల్మాన్, ప్రశాంత్, సుభహాన్, సల్మాన్, వినయ్, ఉపేందర్, పాండు భాస్కర్ తదితరులు సన్మానించారు.
Attachments area