హుస్నాబాద్ సభతో కాంగ్రెస్‌కు కనువిప్పు కావాలి
కోరుట్లలో మరోమారు విజయం సాధించి చూపిస్తా
మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
జగిత్యాల,సెప్టెంబర్8(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్ తదితర పార్టీలకు కనువిప్పు కావాలని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు అన్నారు. ప్రజలు టిఆర్‌ఎస్ వెంటే ఉన్నారని చెప్పడానికి తొలి సభ విజయోత్సవమే నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు స్వచ్ఛందగా వచ్చి హుస్నాబాద్ సభను విజయవంతం చేశారని అన్నారు. మరోమారు తాను కోరుట్ల నుంచి గెలిచి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. హుస్నాబాద్ అంటేనే మొదటి నుంచి సెంటిమెంట్‌గా భావించి సిఎం కెసిఆర్ ఇక్కడి నుంచే శంఖారావం పూరించారని అన్నారు. గతంలోనూ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించి ఘన విజయం సాధించామని అన్నారు. ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి రాష్ట్రంలో ఎన్నికల యాత్ర దిగ్విజయంగా జరిగేలా సీఎం కేసీఆర్‌ను పంపారని అన్నారు. ఈ సభతో కాంగ్రెస్ /-లో దిగులు మొదలయ్యిందని కెవిఆర్ అన్నారు. ఇకపోతే కోరుట్లలో కూడా ఇక్కడి సమస్యలను భుజాన వేసుకొని పరిష్కరిస్తానన్నారు. ఈ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, అభివృద్ధిలోనూ ముందుంచి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడు కూడా ప్రాజెక్టులకు రూపకల్ప చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి నిర్మించడంతో ప్రాజెక్టుల్లోకి నీరు రాబోతున్నదని అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హావిూ ఇచ్చి అమలు చేసిన ఘతన తమ పార్టీదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా అభివృద్ధి జరిగింది. తనను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖను మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నియోజకవర్గం భ్రష్టుపడుతుందని అన్నారు. ఇప్పటి వరకు తాగు, సాగునీరిచ్చే పనులు చివరిదశకు చేరుకున్నాయని, ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇవి మొత్తం ఆగిపోతాయన్నారు. నిరంతరం అభివృద్ధిని కాం క్షిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే ఆలోచనలో ముందుకు వెళితేనే మంచి జరుగుతుందన్నారు.