హుస్నాబాద్ న్యూ ప్రెస్ క్లబ్ విలేకరుల సంక్షేమం కోసం కృషి…!
న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బానోత్ హనుమంత్
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 13(జనంసాక్షి) విలేకరుల వ్యక్తిగత భద్రత వారి కుటుంబానికి రక్షణ కోసం అవసరమైన సంక్షేమం కోసం హుస్నాబాద్ న్యూ ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బానోత్ హనుమంత్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని క్యాస కాంప్లెక్స్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్క పాత్రికేయుని కుటుంబానికి అవసరమైన భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సహకారంతో ప్రతి విలేఖరికి అన్ని విధాల లబ్ధి చేకూరేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.