హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 18(జనంసాక్షి) సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతిని పురస్కరించుకుని పొట్లపల్లి గ్రామంలోని కాకతీయుల ప్రతీక బురుజు వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క అనిల్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్ సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి గర్వంగా చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.స్థానిక వార్డు సభ్యులు పాకాల శ్యాంసుందర్ గౌడ్, గీత కార్మిక సహకార సంఘం నాయకులు మార్క చంద్రయ్య ,చెప్పాలా మల్లయ్య, బత్తిని వెంకటరాజ,ఎల్లయ్య, రాజయ్య, రామచంద్రం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, ఆగస్టు 18( జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో నాటి దుర్మార్గాలు, సాంఘిక దురాచారాలు, దొరల దౌర్జన్యాలు చూసి సహించలేక ఒక్కడే ఒక శక్తిగా, సమూహ వ్యవస్థగా ఎదిగి దుర్మార్గులను చీల్చి చెండాడి తెలంగాణ పౌరుషానికి నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలో నిలిచిన గొప్ప వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈమేరకు సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతిని పురస్కరించుకొని గురువారం కూకట్పల్లి సర్కిల్ పరిధి తూర్పు కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి బిజెపి నాయకులతో కలిసి గజ్జల యోగానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోల్కొండ మహారాజ్ సర్వాయి పాపన్నగౌడ్ జీవించి మూడున్నర శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆయన జీవిత చరిత్ర, వీరోచిత పోరాటాలు, మొగలులపై జరిపిన తిరుగుబాటు నేటికీ తెలంగాణ గడ్డపై చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. 372 వ జయంతిసందర్భంగా కూకట్ పల్లి లోనీ తూర్పు కమాన్ వద్ద గల సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సాధారణ గీతకార్మిక కుటుంబంలో జన్మించి తెలంగాణా పౌరుషాన్ని తెలిపిన వీరుడు, 360 ఏళ్ల కింద తెలంగాణ గడ్డపై మొఘల్ నిరంకుష పాలనను ఎదిరించి తాడిత, పీడిత ప్రజలను ఏకంచేసి బహుజనరాజ్యం నిర్మించిన అసలు సిసలైన తెలంగాణ బిడ్డ అని కొనియాడారు. దొరలు, జాగీరుదార్ల నుంచి మొదలుపెట్టి చివరకు మొగల్‌రాజులనుసైతం గడగలాడించి తెలంగాణ ప్రాంత బిడ్డల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని, ఆయనను తలుచుకుంటేనే ప్రతి తెలంగాణ బిడ్డ పౌరుషం పెల్లుబికి రోమాలు నిక్కబొడుచుకుంటాయని గజ్జల అన్నారు. పాపన్న గౌడ్ జయంతి ఆగష్టు 18న తెలంగాణప్రాంతం అస్థిత్వంలో తిరుగుబాటు ఉందని నిరూపించిన ఉద్యమకారుడని ఆయన పునరుద్ఘాటించారు. ఆనాడు గ్రామాల్లో పాలకులు ఇష్టారాజ్యంగా పన్నులువేసి చెల్లించనివారికి మరణశిక్షలు విధిస్తుంటే… వారి పతనానికి ప్రణాళికలు రచించిన గొప్ప రాజనీతిజ్ఞుడు పాపన్న గౌడ్ అని అభివర్ణించారు. తాను స్వతహగా నేర్చుకున్న యుద్ధరీతులను తన స్నేహితులు, అనుచరులకు నేర్పించి సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడని, మెడికల్లాంటి తన వీరసైన్యంతో బయలుదేరి గోల్కొండ కోటను జయించి తొలి బహుజన రాజుగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నతనేతగా కీర్తించారు. ఈ కార్యక్రమంలో మని భూషణ్, వివి నగర్ డివిజన్ అధ్యక్షులు, నర్సింగ్ రావు. హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు, నవీన్ గౌడ్. చేతులపల్లి శ్రీనివాస్ గౌడ్. గౌడ సంఘాల అధ్యక్షులు నరసింహ గౌడ్, యాదయ్య గౌడ్, గిరి గౌడ్, సత్యనారాయణ గౌడ్, ప్రభాకర్ గౌడ్, బాబు గౌడ్, ఆనంద్ గౌడ్, జగదీష్ గౌడ్. గౌడ సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.