హెల్త్ సర్వేను ఉపయోగించుకోవాలి
వందరోజుల ప్రణాళికతో ఏప్రిల్ మాసాంతానికి పూర్తి
నిజామాబాద్,ఫిబ్రవరి15(ఆర్‌ఎన్‌ఎ): వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలు వ్యాధులతో దవాఖానల చుట్టూ తిరుగుతున్న వారికి భరోసా కల్పించేలావ్యాధులపై సర్వే చేయనున్నారు. ఈ పక్రియను రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఈ వేసవిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సర్వే ప్రారంభించింది. గ్రావిూణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వ్యాధి లక్షణాలను గుర్తించి పరీక్షలు చేస్తారు. అనంతరం ఉచిత వైద్యం, మందులు అందించనున్నారు. రక్తపోటు, మధుమేహం, కొవ్వు, హీమోగ్లోబిన్, కాలేయ, మూత్రపిండాలు, దంతవ్యాధులను గుర్తించి తగిన వైద్యం అందించనున్నారు. ఆర్‌బీఎస్‌కే 104 వాహన సేవలను ఇందు కోసం ఉపయోగించనున్నారు. పల్లె ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కార్ అంచలంచెలుగా ఆరోగ్య తెలంగాణెళి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం
ప్రభుత్వం వద్ద ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఇంటింటి సర్వే చేపడుతోంది. ఈ మేరకు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగా బాధితులకు వైద్యంతో పాటు అవసరమైన శస్త్రచికిత్సలు చేయనున్నారు. ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కేఎస్) ఆధారంగా ఇంటింటా తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో ఎంత మందికి వ్యాధులు ఉన్నాయి, ఎంత మందికి శస్త్రచికిత్సలు అవసరమో గుర్తించి ఆ తర్వాత వారికి వైద్య సేవలు అందించనున్నారు. పరీక్షల కోసం గ్రామం నుంచి రెఫరల్ దవాఖాన వరకు టాటా ట్రస్టు సాఫ్ట్ వేర్‌లో పర్యవేక్షణ జరుగుతుంది. గ్రామాల నుంచి రెఫర్ చేసిన దవాఖాన వరకు వైద్య సేవలు ఈ ఏడాదికి ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం.సర్వే చేయడానికి ఇంటికి వచ్చి న వారికి వివరాలు చెప్పాల్సి ఉం టుంది. మనం ఇచ్చే వివరాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తా రు. త్వరలోనే నమోదైన ఆన్‌లైన్ ప్రకారం ఎవరికైనా ఏదైనా వ్యాధి వస్తే దాన్ని నయం చేయడానికి హెల్త్ ప్గ్రొ/ల్‌ను రూపొందించడానికే ఈ సర్వే నిర్వహించనున్నారు. దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలిన అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్ సూచించారు.