హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందె భవితారాణి
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 11 ,
జనంసాక్షి
మెటుపల్లి పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మెటుపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందె భవితారాణి మాట్లాడుతూ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో విష జ్వరాలు విపరీతంగా పెరిగిపోయి వయసుతో సంబంధం లేకుండా ప్రజలు డెంగ్యూ లాంటి జ్వరాల బారిన పడి మరణిస్తుంటే అధికారులు, అధికార పార్టీ నాయకులు మిన్నకుండడం బాధాకరమన్నారు. నియోజకవర్గం లోని పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సరిగా నిర్వహించకపోవడం, ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల దోమలు క్రిములు ఏర్పడి ప్రజలు విష జ్వరాలతో అవస్థలు పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని , అయినా సంబంధిత అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యపై జగిత్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారులు పరిశీలించి సమస్య పరిష్కారానికి విష జ్వరాల కట్టడికి సంబంధిత అధికారులకు సలహాలు సూచనలు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి బాస చిన్నమ్మ, మెటుపల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెన్నూరి నిర్మల, లక్కిడి నర్సక్క, లావణ్య తదితరులు పాల్గొన్నారు.