హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుర్మార్గం

మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల గోపాలరావు

 

మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం దుర్మార్గం నీతి బాహ్యమైన చర్య ఇది ఒక పిరికిపంద చర్యయని, ఎన్టీఆర్ అంటే ఒక మహోన్నత శక్తి తెలుగువార ఆత్మగౌరవానికి ప్రతీక అలాంటి మహోన్నత వ్యక్తి పేరుపై ఏర్పాటైన హెల్త్ యూనివర్సిటీకి పెట్టిన పేరు మార్చి ఆయన తెలుగువారికి చేసిన సేవ కృషి అన్ని అవమానించినట్లేనని మునగాల మండల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హెల్త్ యూనివర్సిటీ కి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టేవరకు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లు విశ్రమించరని, దానికోసం అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు నాదెండ్ల గోపాలరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీపై ఉన్న అక్కసును జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ పేరు మార్పు ద్వారా వెళ్లగక్కారని, శిశుపాలిని నూరుతప్పుల వలనే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులలో ఇది గౌరవ తప్పుగా మిగులుతుందని, ఈ నిర్ణయంతో ఆయనకు ఆయన పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఆయన కోరారు. అలాగే ఇప్పటికీ వైసీపీలో ఉంటూ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బ్రోకర్లు బయటికి వచ్చి స్పందించాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి వస్తుందని, దానికోసం ఎన్టీఆర్ అభిమానులు పార్టీ కార్యకర్తలు మేధావులు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు పూర్ణ శంకర్, కార్యదర్శి గురుస్వామి, కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, వీరబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి సభ్యులు మోహన్ రావు, రాఘవేంద్రరావు, గోపి, కుమార్, అశోక్, సూర్య, ప్రదీప్ మల్లయ్య, కాశయ్య, సైదా, కృష్ణారెడ్డి, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొని ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై పునసమీక్షించాలని, లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.