హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సందర్శన.
సిరిసిల్ల. అక్టోబర్ 14 (జనం సాక్షి). హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సింగ్ కళాశాల విద్యార్థులకు క్షేత్రస్థాయి సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుర్కకాశి పల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఇంటింటికి తిరిగి క్షేత్రస్థాయిలో సందర్శించి అధ్యయనం కొనసాగించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులు మనోవికాస కేంద్రం సైకాలజిస్ట్ పున్నం చందర్ పలు సామాజిక అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు అనురాధ ,లలిత, ఎలగందుల పరమేశ్వర్ ఆలీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు