హైకోర్టుకు చేరిన వరంగల్ డీసీసీబీ వ్యవహారం
వరంగల్ : డీసీసీబీ ఎన్నికల ఫలితాలు వ్యవహారం హైకోర్టుకు చేరింది. డీసీసీబీ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా వాయిదా వేయడంపై కాంగ్రెస్ అభ్యర్థి జంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.