హైదరాబాద్‌లో 4జీ సేవలు

8హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)

హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు అందించేందుకు ఎయిర్ టెల్ రెడీ అవుతోంది. మార్చి చివరికల్లా హైదరాబాద్ తోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, మైసూరు నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే కోల్ కతా, బెంగళూరు, చండీగఢ్, అమృత్‌సర్, నాసిక్, నాగ్‌పూర్ తదితర 16 నగరాలకు విస్తరించింది. డిసెంబర్ నాటికి ఎయిర్ టెల్ లెసైన్సు కలిగిన 18 సర్కిళ్లలో ప్రవేశించనున్నట్టు సమాచారం. అటు హైస్పీడ్ ఇంటర్నెట్ 4జీ కోసం కస్టమర్లు రెడీ అవుతున్నారు. చార్జీలు 3జీ స్థాయిలోనే ఉండడంతో అప్ గ్రేడ్ అయ్యేందుకు వినియోగదార్లు ఉత్సాహం చూపిస్తున్నారు. హైదరాబాద్ లో 1.25 లక్షల మంది వద్ద 4జీ ఫోన్లు ఉన్నట్టు సమాచారం.