హైదరాబాద్ లో సిమి కార్యకలాపాలు లేవు:నాయిని
హైదరాబాద్: సిమి కార్యకలాపాల జాడలు హైదరాబాద్లో లేవని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ చాలా సురక్షితమైన ప్రాంతమని..ప్రజల భద్రత విషయంలో భయాందోళనలు అనవసరమని చెప్పారు. సూర్యాపేట ఘటనలో తప్పించుకున్న మిగతా ఉగ్రవాదుల కోసం ఐదు రాష్ర్టాల పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.