హోటళ్లపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్‌లోని హోటళ్ల పై పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వవుంచిన 13 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన హోటల్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ తహశీల్దార్ మల్లిఖార్జున్ తెలిపారు.