హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పేదలకు బట్టల పంపిణి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు08:-
హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బట్టల పంపిణి విజయవంతమైనదని ఆయన అన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన బిసి సంక్షేమ సంఘము రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనాగాని యాదగిరి గౌడ్ హనుమకొండ జిల్లా కేంద్రంలోని పద్మాక్షి గుట్ట సమీపాన గల లెప్రసీ కాలనీ 60 కుటుంబాలకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్ ఆదేశానుసారం రాజారపు ప్రభుదేవ్-అనూష లు తమ వివాహ కానుకగా బట్టలను అందిచగా హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి ఆద్వర్యంలో బిసి సంక్షేమ సంఘము రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనాగాని యాదగిరి గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని పేదలకు బట్టల పంపిణి చేశారు. ఈ సందర్బంగా బోనాగాని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సదుద్యేశంతో పేదలకు బట్టల పంపిణి చేపట్టిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్ కు , హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతికి అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేదలకు అండగా ఉండాలని కోరారు. లెప్రసీ కాలనీ వాసులు తమకు సరైన వసతులు లేవని, వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తమకు కేటాయించాలని వేడుకున్నారు. తమకు బట్టల పంపిణి చేసినందుకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ రాజరపు ప్రతాప్ కు, సహకరించిన రాజారపు ప్రభుదేవ్ కు, హనుమకొండ జిల్లా కమిటి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘము హనుమకొండ జిల్లా అధ్యక్షులు నారగోని కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులు జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, గ్రేటర్ వరంగల్ గోపా ప్రధాన కార్యదర్శి బూర అశోక్ గౌడ్, వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ-హనుమకొండ జిల్లా కన్వీనర్ నలెల్ల రాజయ్య, ఫర్ ద పీపుల్ అధ్యక్షులు వెల్ది అనిల్, మైనారిటి నాయకులు యాకుబ్, వర్ధన్నపేట నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షులు సౌరం ప్రియదర్శిని, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వేలేరు మండల అధ్యక్షులు కీర్తి సురేష్ , హెచ్.ఆర్.సి జిల్లా సభ్యులు,లెప్రసీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.