•ధరణిలలోపాలను సవరించాలి భూ సమస్యలను పరిష్కరించాలి
•తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాల్ రెడ్డి
జనం సాక్షి,వంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో లోపాలను సవరించి భూ సమస్యలనుపరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘంజిల్లా అధ్యక్షులుచిలుక బాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదుపరిఆయనమంగళవారంవంగూరుమండలతె లంగాణ రైతు సంఘంఆధ్వర్యంలోతాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాకుముఖ్యఅతిథిగాహాజరై ప్రసంగించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్లో అనేక లోపాల కారణంగా రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో 22 అంశాలకుగాను11 అంశాలను ధరణిలో చేర్చడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని ధరణి లో లోపాలను సవరించాలని సమస్యలను పరిష్కరించాలని, 50 సంవత్సరాలు దాటిన రైతులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, పంటలకు గిట్టుబాటు రేటు కల్పించాలని, వారికి కేరళ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ మాదిరిగా 700 రూపాయలు బోనస్ ఇవ్వాలని ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల రెవెన్యూ తాసిల్దార్ రాజు నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివరాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆంజనేయులు, బాలస్వామి, గోపాల్, అంతయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.