108 సేవలపై హైకోర్టు విచారణ వాయిదా
హైదరాబాద్: 108 సేవలపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. 108 సేవల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సేవలపై ఏటా సమీక్ష నిర్వహించాలని కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.



