-108, 102 సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. -ఉమ్మడి జిల్లా అధికారి సామ్రాట్.
దండేపల్లి .జనంసాక్షి జూలై 28 దండేపల్లి మండలంలోని 108,102 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ కోరారు. గురువారం దండేపల్లి మండలంలోని 102, 108 సేవల వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల్లోని రికార్డులను పరిశీలించి, వాహన సామర్థ్యాన్ని పరిశీలించారు. వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహ ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో 108, 102 సేవలను ప్రజలు సద్విని చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట మంచిర్యాల జిల్లా ఈఎంఇ అధికారి కొండల్ రావు, ఈఎంటి కిషన్, 108, 102 పైలట్లు గోపి, మహేందర్ ఉన్నారు.