11 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 50/1
సిడ్నీ: ముక్కోణపు టోర్నీలో ఆసీస్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో భారత్ 11 ఓవర్లకు వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (8) మరోసారి నిరాశపరిచారు. మరో ఓపెనర్ రహానె 36 బంతుల్లో 21 పరుగులు, రాయుడు 18 బంతుల్లో 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని యత్నిస్తోంది. కాగా మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ ల్లో గెలిచి ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 44 ఓవర్లకు కుదించారు.