బస్సు కొలనులో పడి 11 మంది మృతి
బీజింగ్: మధ్య చెయనాలోని పర్వత ప్రాంతంలో స్కూలుకు చిన్నారులను తీసుకెళ్లే మినీ వ్యాన్ ఒకటి కొలనులో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. వారిలో 8 మంది కిండర్‌గార్టెన్ చదివే చిన్నారులు. బడినుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని, మినీవ్యాన్‌లో చోటుకు మించి ఎక్కువ మంది పిల్లలను ఎక్కించడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.