స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాలకు 11న ఎంపిక

ఏలూరు,జులై9(ఆర్‌ఎన్‌ఎ):

రాష్ట్రంలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, కడప జిలాల్లోని స్పోర్ట్స్‌ స్కూళ్లలో నాలుగో తరగతి నుంచి జూనియర్‌ ఇంటర్‌ వరకు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న ఉదయం 8 గంటల నుంచి జిల్లా స్థాయిలో ఎంపికలు జరుగుతాయని ఆయన చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఎత్తు, బరువు, 800 విూటర్లు పరుగు విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు తమ కార్యాలయం లోసంప్రదించాలని కోరారు
. ఎంపికల సమయంలో జనన ధ్రువీకరణ, చదువు ధ్రువీకరణ, రెండు ఫోటోలు, గత విద్యాసంవత్సరపు నివేదికలు, గతంలో ఏదైనా క్రీడలో ప్రతిభ చూపితే ఆ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని ఆయన తెలిపారు.