11,420 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
హైదరాబాద్: పలు శాఖల్లో 11,420 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల తర్వాత జరుగుతున్న ఈ మంత్రి వర్గ సమావేశానికి ఏడుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. విద్యాశాఖలో 11.142 పోస్టుల భర్తీకి, వివిధ శాఖల్లోని 278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్ధిక శాఖలో 22 అంశాలకు సంబంధించి రూ. 471 కోట్లు మంజూరుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది.నీలం తుపాను నష్టంపై మంత్రివర్గం అధికారుల వివరణ కోరింది.



