1,2 తేదీల్లో జోన్‌-1,3 లకు నీటి సరఫరా

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : మార్కాపురం పట్టణానికి దూపాడు నుండి నీరు సప్లైచేయు ప్రధానపైపులైన్‌కు ఏర్పడిన లీకులకు జరుగుతున్న మరమ్మతులు పూర్తికానందున జులై 1వ తేదీన ఉదయం 4 గంటలకు మంచినీటిని జోన్‌-1 పరిధిలో ఉన్న నెహ్రూబజార్‌, గాంధీబజార్‌, రాజాజీవీధి, తూర్పువీధి, గొర్లగడ్డ నాయుడు వీధి ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేయుబడునని మునిసిపల్‌ కమీషనర్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. అలాగే జోన్‌-3 పరిధిలో ఉన్న వడ్డేబజార్‌, ఎబిఎం కాంపౌండ్‌, ఆర్టీసి బస్టాండ్‌ వెనుకవైపు, ఎస్సీబిసి కాలనీ మరియు పూలసుబ్బయ్య వీధిలకు జులై 2వ తేదీన ఉదయం 4 గంటలకు మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని మునిసిపల్‌ కమీషనర్‌ తెలిపారు.