12 రోజులు గడుస్తున్నా నీవు చెప్పిన 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ ఎక్కడ కేసీఆర్ ?

గిరిజన సంఘం నాయకులు డిమాండ్

అచ్చంపేట ఆర్సి, సెప్టెంబర్ 29, (జనం సాక్షి న్యూస్): ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తానన్నాడని ఆ హామీని నిలబెట్టుకోవాలని వారం రోజులలో గిరిజనుల రిజర్వేషన్ పెంచుతూ జీవో తీసుకువస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు,దేశ్య నాయక్, ప్రధాన కార్యదర్శి ఎం శంకర్ నాయక్అన్నారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం రిజర్వేషన్ ను కల్పించే జీవో ను వెంటనే తీసుకురావాలని, ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపులో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వాలని సంఘం పిలుపుమేరకు కార్యక్రమం చెయ్యకముందే తమను ముందస్తుగా పోలీసుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గిరిజన సంఘ నాయకులను అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా ధమాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్ పెంచుతానని ఈ నెల 17వ తేదీన బంజారా ఆదివాసి భవనాలు ప్రారంభం చేస్తూ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతూ జీవో తీసుకువస్తానన్న మాట వారం గడిచిపోయిన ఇప్పటివరకు అమలు చేయకపోవడం ముఖ్యమంత్రికి తగదని, వెంటనే జీవో అమలుకు ప్రక్రియ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు . కార్యక్రమంలో వంశీ నాయక్, శ్రీరాం నాయక్ రవి నాయక్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.