120పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: కేంద్రంలోని యూపీఏ సర్కారులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభావంతో సెన్సెక్స్‌ 120.41పాయింట్లు కోల్పోయి 17158.44వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 37.50పాయింట్లు నష్టపోయి 5205.10వద్ద స్థిరపడింది. రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆర్థిక సంస్కరణలు వేగవంతమవుతాయని భావిస్తున్న తరుణంలో కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్‌సీపీకీ చెందిన మంత్రులు పవార్‌ప్రపుల్‌ పటేల్‌ రాజీనామాలతో మార్కెట్‌లో కొనుగోళ్లపై ప్రభావం చూపిందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. బజాజ్‌ ఆటో టీఎసీఎస్‌లకు చెందిన షేర్లకు ఆదరణ లభించింది.