పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్‌లలో తెచ్చి అవికాస్తా భూమి లో వేయడంతో కానరాని వర్షాలతో విత్తనం కాస్తా భూమి పాలయ్యాయి.చివరికి రైతన్న తన ప్రయత్నం మానకుండా పోరాడుతూనే వున్నాడు.వర్షాకాలం మొదలై నెలదాటుతున్నాకాని వర్షాలు పడక పోవడం తో నిరాశతో వున్న రైతులు నారు పోసిన ఆ నారు కాస్తా భూమి పాలవుతుందని అనుకుంటుండగా ఈ కొద్ది పాటి వర్షాలతో పెద్దపల్లి మండలంలో రైతులు నాట్లు వేస్తున్నారు.మండలంలో సుమారుగా 80శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.వ్యవసాయ అధికారులు మాత్రం రైతులు ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.ఈ సంవత్సరం ఎరవుల కొరత ఉండదని అన్ని సోసైటీలలో రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో వుంచామని తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
- హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
- మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
- మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
- ఈ నెల 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి
- టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం
- హత్యాయత్నం నిందితుడి రిమాండ్
- అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.
- దృష్టి మరల్చేందుకే ‘డైవర్షన్’
- సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం
- శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్
- మరిన్ని వార్తలు



