13లోగా పరిష్కరించాలి

కడప, ఆగస్టు 3 : తెలుగుగంగ ముంపు బాధితుల సమస్యలను ఈ నెల 13వ తేదీలోగా పరిష్కరించకపోతే ఈ నెల 13న ఎస్‌పిబి రిజర్వాయర్‌లోకి బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ నుంచి విడుదల చేసే నీటిని అడ్డుకుంటామని తెలుగుగంగ ముంపు బాధితుల సంఘం నాయకుడు రమణ చెప్పారు. ఆ కాల్వను పూడ్చి వేస్తామని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో అనేక మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి ముంపు బాధితుల పక్షాన వినతిపత్రాలను అందించామని ఆయన అన్నారు. అధికారులదృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లామన్నారు. సమస్యను పరిష్కరించ కుండా ఆర్‌టిపిపికి నీటిని తీసుకువెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు పునరావాస కేంద్రాల్లో పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.