13వ రెంజుకి షోటోకాన్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో దుబ్బాక విజేత
దుబ్బాక జనం సాక్షి.మెదక్ పట్టణంలోని బికే భారత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం మల్లూరి చంద్ర కళ మెమోరియల్ 13 వ రెంజుకి షోటోకాన్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్- 2022 దుబ్బాక పట్టణ విద్యార్థులు 20గోల్డ్ మెడల్స్, 13సిల్వర్ మెడల్స్, 10 బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. విజేతలుగా గెలిచిన వారందర్నీ అలానే మాస్టర్ బురాని శ్రీకాంత్ ను మెదక్ డీఈవో శ్రీనివాస్ రెడ్డి గారు అభినందించారు.
దుబ్బాక కేజీబీవీ హాస్టల్ 13 గోల్డ్ మేడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 9 బ్రౌంజ్ మెడల్స్, లచ్చ పేట మోడల్ స్కూల్ 5 గోల్డ్ మేడల్స్,1 సిల్వర్ మేడల్, అలానే దుబ్బాక గౌట్ కాలేజ్ 1 సెల్వర్ మేడల్, చెల్లాపూర్ 2 సిల్వర్ మెడల్స్, దుబ్బాక గ్లోబల్ స్కూల్ 2 గోల్డ్ మెడల్స్ 1 సిల్వర్ మెడల్ 1 బ్రౌజ్ మోడల్, దిశ స్కూల్ 1 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. వీరందరినీ మాస్టర్ బురాని శ్రీకాంత్ అభినందించాడు.