పిడియాక్టు కేసులు లేవు సబ్సిడీ గొర్లు లేవు…….

–దళారులకు కొమ్ము కాస్తున్నా అధికారులు
–పశుఅధికారులే దగ్గరుండి బయట ఊరికి పంపుతున్నారు.
వీర్నపల్లి అక్టోబర్ 27 (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండల కేంద్రంలో భారీగా సబ్సిడీ గొర్రెలను దళారులకు అమ్మడం జరగుతున్నా పశుసంవర్ధక అధికారుల ప్రేక్షక పాత్రలోఅంతర్యం ఏమిటని ప్రజలు వాపోతున్నారు.వివరాలలోకి వెళ్లి తే రెండవ విడతలో మండల కేంద్రంలో 45 యూనిట్ రావడం జరిగింది. అటూ నుండి రావడం ఆలస్యం లేకుండా కొత్త పల్లి బోప్పపూర్ గొల్లపల్లి దళారుల గ్రూపు గ్రామంలో దిగింది. వారు గొర్లు దిగిన చోట వెళ్ళి 1,25,000ధర పలికి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ గోర్లను 80,000నుండి 60,000మధ్య ధర కుదుర్చుకోవడం జరుగుతుంది. బంగారు తెలంగాణ లో బాగంగా సబ్సిడీ గొర్రెలను ఇచ్చి యాదవులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేస్తుంటే పశుసంవర్ధక అధికారులతో యూనిట్ దారులు మరియు దళారులు కుమ్ముకై అమ్మడు పోవడం జరుగుతున్న కండ్లు కు గంతులు కట్టినట్లు ప్రభుత్వ అధికారులు ఉంటున్నారని గ్రామ ప్రజల ఆవేదన.గ్రామ పశు ఎల్ ఎచ్ఫ్ గంగరాం అధికారుల ప్రమేయంతోనే ఇక్కడ నుండి సరఫరా అవుతున్నాయని ప్రజల అంటున్నారు. దిని విషయం లో పశువైద్యాధికారిణి రేణుకాను వివరణ కోరగా అలా అమ్ముకుంటే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అన్నారు.



