ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోకుండా కృతజ్ఞత సభ ఎందుకు….

 

సమావేశంలో మాట్లాడుతున్న

 

ఎల్లారెడ్డిపేట నవంబర్‌ 11 (జనంసాక్షి) తాజా మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రైతులకు ఏం ఒరగ పెట్టారని రైతు కృతజ్ఞత సభ నిర్వహించారో, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ఒక్క కుటుంబాన్ని పరమార్శించని కెటీఆర్‌ రైతులకు వచ్చి సబ్సిడి ట్రాక్టర్లను టిఆర్‌ఎస్‌ నాయకులకు ఇచ్చి రైతులను ఆదుకున్నమని సభ నిర్వహించడం రైతులను మోసం చేస్తున్నట్లేనని తెలంగాణ జనసమితి మండల అధ్యక్షుడు దాసరి గణేష్‌ ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో గణేష్‌ మాట్లాడుతూ….టిఆర్‌ఎస్‌ పాలనలో రైతులను ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోలేదని నాగుల్లే కాలంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకన్న విషయం తెలిసి కూడా ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోకపోవడమే కాకుండా కనీసం పరామర్శించే పాపనపోలేదన్నారు. రైతుల పేరిట ప్రభుత్వ ఖజానకు గండికొడుతూ రైతు సబ్సిడి ట్రాక్టర్‌లకు ప్రవేశపెట్టిటిఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు, సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు సబ్సిడి ట్రాక్టర్లను ఇచ్చుకున్నారన్నారు.రైతుల పేరిట రైతుసమన్వయ కమిటీలను వేసి రైతులను ఎన్నుకోవలసి ఉండగాటిఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సమన్వయ కమిటి అద్యక్ష భాద్యతలు ఇచ్చి రైతులకు మోసం చేస్తున్నారన్నారు. రైతుసమన్వయ కమిటిలో ఒక్క ఆదర్శమైనటువంటి రైతు ఉన్నాడా అని టిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. రైతుబందు పథకం పెట్టి అవి అసలైన రైతులకు ఉపయోగపడే విధంగా లేకుండా చేశారని భూస్వాములు వ్యవసాయం చేయకుండానే ఆరునెలలకు ఒకసారి లక్షల రూపాయాలు రైతుబందు చెక్కులను పొందుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. రైతుబందు బదులు మద్దతు ధర పెంచితే అసలైన రైతుకు న్యాయం జరిగేదన్నారు. చిన్న రైతులకు పట్టాలు, చెక్కులు అందలేదన్నారు. పట్టణంలో ఉన్న భూస్వాములకు పట్టాలు ఇచ్చి వారికి కోట్లాది రూపాయాల ప్రజాధనాన్ని పంపిపెడుతున్నారని ఆరోపించారు. ఇది రైతుల కృతజ్ఞత సభ కాదని టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారసభ అని రైతులు టిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో జనసమితి నాయకులు పిట్ల శివ, అందె బాబు, రమేష్‌లు పాల్గొన్నారు.

మహేందర్‌రెడ్డి గెలుపుఖాయం